
Ravichandran Ashwin: 500 వికెట్ల క్లబ్‌లో నాథన్ లియాన్.. స్పందించిన రవిచంద్రన్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) అరుదైన ఘనత సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్ చేరి రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో లియాన్ ఈ మైలురాయిని అధిగమించాడు.
ఈ మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీసిన లియాన్.. 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఇక లియాన్ ఆస్ట్రేలియా తరుపున 500 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా రికార్డుకెక్కాడు.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 500 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో లియాన్ నాథన్ లియాన్ 8 స్థానంలో ఉన్నాడు.
తాజాగా లియాన్ ఈ ఘనత సాధించడంపై టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) స్పందించాడు.
Details
భారత్ నుంచి ముగ్గురు
500 వికెట్లు తీసిన 2వ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక్కడేనని, అతనికి అభినందనలు అని ట్విట్టర్ వేదికగా అశ్విన్ పేర్కొన్నాడు.
ఇది చాలా గర్వించదగ్గ విషయమని, 500 వికెట్ల క్లబ్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని నాథన్ లియాన్ పేర్కొన్నాడు.
అయితే భారత్ నుంచి అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే 500 వికెట్ల క్లబ్‌లో చేరారు.
2011లో టెస్టు క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన లియాన్ 123 టెస్టు మ్యాచుల్లో 500 వికెట్లు తీశాడు.