Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర.. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. గుజరాత్ బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి అదరగొట్టాడు. సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో అవుట్ అయ్యాడు. అంతకుముందు ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 97 పరుగులు చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
వివరాలు
1000 పరుగులు పూర్తి..
ఇప్పటివరకు 23 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సాయి సుదర్శన్ పేరిట ఉండేది. అతడు 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెండల్ సిమ్మన్స్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ 23 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. డెవాన్ కాన్వే 24 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, మాథ్యూ హేడెన్. సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశారు.