Varun Chakravarthy: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్.. జట్టులోకి వరుణ్ చక్రవర్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఈ ప్రదర్శనతో, అతను ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు.
సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీంతో, మొదటి మ్యాచ్ కోసం ప్రస్తుతం నాగ్‌పుర్‌లో సాధన చేస్తున్న భారత జట్టులో వరుణ్ చేరాడు. ఈ వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 14 వికెట్లు తీసి,'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో అతను ఐదు వికెట్లు పడగొట్టి గొప్ప ప్రదర్శన అందించాడు. అయితే,తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు.
వివరాలు
వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకుంటే..
ఇదే నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టులో వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కలేదు.
ఇప్పటివరకు అతను ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, ఈ యువ స్పిన్నర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకుంటే, టీమ్‌ఇండియాకు కీలకంగా మారతాడని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ముందుగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అతనికి అవకాశం కల్పించాలన్నాడు.
వివరాలు
వరుణ్ ఎంపిక గొప్ప నిర్ణయమే.. కానీ..!
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వరుణ్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమేనని చెప్పాడు.
అయితే, వన్డేల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అతని బౌలింగ్‌ను మెరుగుగా ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
వన్డే ఫార్మాట్ టీ20ల కంటే సుదీర్ఘమైందని, బ్యాటర్లు మైదానంలో ఎక్కువ సమయం గడిపే అవకాశముండటంతో వారు బౌలర్లను సమర్థవంతంగా ఆడగలరని పేర్కొన్నాడు.
ప్రతి బంతి అద్భుతంగా మారాలని భావించడం వాస్తవానికి దూరమని పీటర్సన్ వ్యాఖ్యానించాడు.
వివరాలు
టీమిండియా అప్‌డేటెడ్ జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.