సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌తో తలపడనున్న అప్ఘాన్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆప్గనిస్థాన్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో పాకిస్థాన్ పై అద్భుత విజయాన్ని చేసి ఫైనల్లోకి అప్ఘాన్ జట్టు అడుగుపెట్టింది. శనివారం భారత్-అప్ఘాన్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనలో అప్గాన్ 17.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శనివారం ఫైనల్లో భారత్-పాక్ మ్యాచును చూద్దామని ఆవించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇవాళ ఉదయం జరిగిన తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా జట్టు ఓడించిన విషయం తెలిసిందే.