#Viral Moment: బుమ్రా బౌలింగ్‌లో చెలరేగిన బుడ్డోడు.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
నిన్నటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ , ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 15 ఏళ్ల వయస్సున్న వైభవ్ సూర్యవంశీ, అనుభవజ్ఞుడైన బుమ్రా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడో అనే ఆసక్తి మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరిలో కనిపించింది. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ పోటీలో వైభవ్ తన ప్రతిభను చూపించి మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.
వివరాలు
చెలరేగిపోయాడిలా..
వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు పరిమితం చేశారు. టాస్ కోల్పోయిన రాజస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్‌ను వేసిన దీపక్ చాహర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ 22 పరుగులు సాధించి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం చోటు చేసుకుంది. బుమ్రా బంతి పట్టుకుని బౌలింగ్‌కు సిద్ధమవగా, స్ట్రైక్ వద్ద వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు.
వివరాలు
మొదటి బంతికే సిక్సర్..
బుమ్రా వేసిన మొదటి బంతినే వైభవ్ సిక్సర్‌గా మలచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఫుల్ లెంగ్త్ బంతిని వైడ్ లాంగ్-ఆన్ దిశగా అద్భుతంగా బాదాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతిని కూడా బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు సిక్సర్‌గా మార్చాడు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి, అందులో 13 పరుగులు వైభవ్ ఖాతాలోనే చేరాయి. తన బౌలింగ్‌లో వరుసగా సిక్సర్లు ఇచ్చినా కూడా బుమ్రా చిరునవ్వుతో స్పందించడం అభిమానులను ఆకట్టుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡
— IndianPremierLeague (@IPL) April 7, 2026
🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X