Loading...
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91.. రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఫ్లాప్!
విరాట్ కోహ్లీ 91.. రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఫ్లాప్!

Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91.. రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఫ్లాప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఇండియా-ఎ, ఇండియా-బి జట్లుగా విడిపోయి తలపడిన ఈ మ్యాచ్‌లో పలువురు స్టార్ బ్యాటర్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ అజేయ భారీ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా రాణించారు.

వివరాలు

కోహ్లీ అజేయ 91.. ఇండియా-ఎ 319

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

88 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడికి రవీంద్ర జడేజా నుంచి మంచి సహకారం లభించింది.

జడేజా 39 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 42 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు.

అయితే శుభ్‌మన్ గిల్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న గిల్ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు.

వివరాలు

యశస్వి, రోహిత్ మెరుపులు.. నితీష్ కీలక ఇన్నింగ్స్

అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-బి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు.

యశస్వి జైస్వాల్ 68 బంతుల్లో 72 పరుగులు చేసి ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ 59 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

మిడిలార్డర్‌లో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతులు ఎదుర్కొన్న నితీష్ 61 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.

నమన్ ధీర్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అయితే ధ్రువ్ జురెల్ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ADVERTISEMENT

వివరాలు

సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్

5 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివరికి ఇండియా-బి 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులకే పరిమితమైంది. వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.

తొలి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది. అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్‌తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.

ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తుది జట్టు ఎంపికకు ముందు స్టార్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT