Page Loader
ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి
బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి

ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 09, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతకెక్కాడు. భారత్ తరపున అత్యధిక క్యాచులను అందుకున్న నాన్ వికెట్ కీపర్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మేరకు డ్రెసింగ్ రూంలో విరాట్, ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో కోహ్లీ ఒకరు. ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియా మ్యాచ్ లో కోహ్లీ మొదటి స్లిప్ లో మైమరపించే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో 15 క్యాచులను అందుకున్న మొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించాడు. చెన్నైమ్యాచ్ గెలుపు అనంతరం డ్రెసింగ్ రూంలో ఉత్తమ ఫీల్డర్ గా విరాట్ కోహ్లికి టీమ్ మేనేజ్ మెంట్ అవార్డును అందజేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ అందుకున్న విరాట్ కోహ్లీ