Virat kohli: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా లక్నవూతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయి వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్ లు ఓడిపోయినప్పటికీ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఓ రికార్డును సాధించారు. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్ తో విరాట్ కోహ్లీ ఆ స్టేడియంలో 100 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డుల్లో కెక్కారు. ఇలా ఒకే వేదికపై 100 మ్యాచ్లు ఆడిన భారత క్రికెట్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కారు.
ఒకే వేదికపై ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ముగ్గురే..
విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ముంబైలో వాంఖడే స్టేడియంలో 80 మ్యాచ్లు ఆడారు. ఆ తర్వాతి స్థానంలో చెన్నై చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ధోనీ 69 మ్యాచ్ లు ఆడారు. ఒకే వేదికపై ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఈ ముగ్గురే కావడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి లక్నవూ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 22 పరుగులు సాధించారు. ఐపీఎల్ మ్యాచ్లో బ్యాట్ తో రాణిస్తున్న విరాట్ కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచకప్ లోనూ ఆడించాలని పలువురు క్రికెట్ సీనియర్లు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అయితే విరాట్ కోహ్లీని కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.