Virat Kohli: విరాట్ కోహ్లీ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ : ఆకాశ్ చోప్రా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ ఉన్నాడు. గురువారం వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న టెస్టు కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ కు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ అని, కోహ్లీ జీవితం మొత్తం ఓ సన్యాసిలా గడిపాడని అతను పేర్కొన్నారు. గేమ్ పట్ల అతనికి ఉన్న అంకిత భావం అమోఘమని, ఇండియన్ క్రికెట్ కే కాదు క్రికెట్ కు అతను చేసిన సేవలకు అందరూ రుణపడి ఉండాలని కొనియాడారు.
నాలుగో ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేయనున్న కోహ్లీ
500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ మరెన్నో రికార్డులు సాధించేలా ఈ మ్యాచ్ స్ఫూర్తి నింపుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఓఝా స్పష్టం చేశారు. మరో క్రికెటర్ వసీం జాఫర్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.ప్రతి ఒక్కరూ 500 మ్యాచులు ఆడలేరని, తనను తాను ఫిట్ గా ఉంచుకుంటూ, అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు చేయడం అభినందనీయమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు అతను ఒక రోల్ మోడల్ అని జాఫర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500వ మ్యాచ్ ఆడనున్న నాలుగో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించనున్నాడు.