Page Loader
Virat Kohli: శ్రీలంకతో ఇవాళ రెండో వన్డే.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే
శ్రీలంకతో ఇవాళ రెండో వన్డే.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే

Virat Kohli: శ్రీలంకతో ఇవాళ రెండో వన్డే.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో భారత్ ఇవాళ రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈరోజు లంకతో జరిగే మ్యాచులో కోహ్లీ 92 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 27వేల పరుగులు పూర్తి చేస్తాడు. ఇదే జరిగితే ఈ మైలురాయిని అందుకున్న నాలుగో క్రికెట్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పనున్నాడు. అదే విధంగా 128 రన్స్ చేస్తే వన్డేల్లో కూడా 14వేల పూర్తి చేసుకున్న ఆటగాడి నిలవనున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా రన్ మిషన్ రికార్డు సృష్టించనున్నాడు.

Details

సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లీ

అంతేకాదు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఏ జట్టుపైనా 100 మ్యాచ్‌లు గెలిచిన ఫీట్‌ను కూడా టీమ్ ఇండియా సాధిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఏ జట్టుపైనా 100 మ్యాచ్‌లు గెలిచిన ఫీట్‌ను కూడా టీమ్ ఇండియా సాధిస్తుంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఆడిన 293 వన్డేల్లో 58 సగటుతో 13872 పరుగులు చేశారు. ఒక వేశ ఈరోజు జరిగే మ్యాచులో 128 పరుగులు చేస్తే 14 వేల పరుగుల మార్కను చేరుకుంటారు. ఇప్పటివరకూ ఘనతను సచిన్ టెండూల్కర్, కుమార్ సంగర్కర్ మాత్రమే సాధించారు.