Virat Kohli-Cricket: ఓవర్ టూ విరాట్ కోహ్లీ...హల్లో హల్లో సునీల్ గవాస్కర్..
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 43 బంతుల్లో 51 పరుగులు చేసిన దానిపై సునీల్ గవాస్కర్ (Sunil Gavasker)తో పాటు మాజీ క్రికెటర్లు కొందరు తీవ్రంగా విమర్శించారు. విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ నుంచి ఇలాంటి ప్రదర్శనను అస్సలు ఆశించడం లేదని సునీల్ గవాస్కర్ కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసే వారికి ఆటపై పెద్ద అవగాహన ఉండి ఉండకపోవచ్చు అని ఎద్దేవా చేశారు.
బాక్స్ లో కూర్చుని కామెంట్ చేయడం ఈజీనే...
కామెంట్రీ రూమ్ లో కూర్చుని కామెంట్రీ చేయడం చాలా సులువే అని బయట కూర్చుని కామెంట్లు చేసే చాలామందికి మ్యాచ్ పరిస్థితి తెలియదని విరాట్ కోహ్లీ సమాధానమిచ్చారు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్ మ్యాచ్ సందర్భంగా స్పందిస్తూ బయట నుంచి వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోమని చెప్పాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ మేము మా జనరేషన్లో చాలా తక్కువ క్రికెటే ఆడాను. నీలా ఎక్కువగా ఆడలేదు మేము చూసే దాని గురించే మాట్లాడుతాం. మాకు ఇష్టాలు అష్టాలు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. కేవలం ఆట గురించి మాత్రమే విశ్లేషిస్తాం. ఒకరిని విమర్శించాలి అనేటువంటి ప్రత్యేక అజెండా మాకు ఏమీ ఉండదు.
స్ట్రైక్ రేట్ 118 గా ఉంటే దాన్ని స్లో ఇన్సింగ్సే అంటారు: గవాస్కర్
స్ట్రైక్ రేటు 118 గా ఉన్నప్పుడు కామెంట్రీ చేసే వాళ్ళు ఎవరైనా సరే అదే ప్రశ్నలు లేవనెత్తుతారు. నేను ఎక్కువగా మ్యాచ్ లు చూడను. కాబట్టి ఇతర వ్యాఖ్యాతలు ఏమన్నారో నాకు తెలియదు. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 14 నుంచి 15 ఓవర్ల వరకు ఆడి 118 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే దానిని స్లో ఇన్నింగ్స్ అనే అంటారు. వాటికి పొగడ్తలేమి ఉండవు. ప్రశంసలు దక్కాలనుకుంటే ఆడే ఆట తీరులో ఆ ఇన్నింగ్స్ చాలా భిన్నంగా ఉండాలి అని సునీల్ గవాస్కర్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.