Page Loader
Virat Kohli: టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా 
టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా

Virat Kohli: టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా,భారతదేశం మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ముందుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఆదివారం రోజున ఈ స్టార్ బ్యాటెర్ పెర్త్ చేరుకున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతని ప్రదర్శన పేలవంగా ఉండడంతో,ఈ సిరీస్‌లో రాణించేందుకు అతను గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. టీమ్‌ఇండియాకు చెందిన యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ కూడా ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో అతను నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు, అందువల్ల ఈ సిరీస్‌లో అతనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ఆస్ట్రేలియా మీడియా కోహ్లీ, యశస్వి జైస్వాల్‌లను ప్రశంసలతో ముంచెత్తుతోంది, వీరిద్దరినీ ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ పత్రికలు కథనాలు ప్రచురించాయి.

వివరాలు 

'కొత్త రాజు'యశస్వి జైస్వాల్‌ 

ఆస్ట్రేలియాలోని 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రిక కోహ్లీ ఫోటోను ఫ్రంట్ కవర్ పేజీలో ప్రచురించింది. అందులో అతని వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో ఆడిన మ్యాచ్‌ల వివరాలు, పరుగులు, సెంచరీలు వంటి వివరాలను పొందుపరిచింది. గతంలో ఈ పత్రిక యశస్వి జైస్వాల్‌ను 'కొత్త రాజు' అనే అర్థం వచ్చేలా హెడ్డింగ్‌ పెట్టింది. అతని శైలి, ప్రదర్శనపై ప్రత్యేక కథనం అందించింది. భారత క్రీడాభిమానులు ఈ ఫోటోలు,కథనాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

భారత్ ఈ సిరీస్‌ను 4-0తో గెలవాల్సిన అవసరం 

భారత జట్టుకు ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చాలా కీలకమైనది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా, భారత్ ఈ సిరీస్‌ను 4-0తో గెలవాల్సిన అవసరం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెందిన భారత జట్టు ఈ సిరీస్‌లో కంగారుల గడ్డపై ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.