Page Loader
virat Kohli@49: విరాట్ 49వ సెంచరీ.. సచిన్ సరసన కింగ్ కోహ్లీ
virat Kohli@49: విరాట్ 49వ సెంచరీ.. సచిన్ సరసన కింగ్ కోహ్లీ

virat Kohli@49: విరాట్ 49వ సెంచరీ.. సచిన్ సరసన కింగ్ కోహ్లీ

వ్రాసిన వారు Stalin
Nov 05, 2023
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీకి ఇది వన్డేలో 49వది కావడం విశేషం. ఈ సెంచరీతో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. సచిన్ వన్డేల్లో 49సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజు నాడు ఈ ఫీట్‌ను సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు, వన్డే క్రికెట్‌లో 49 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు టెండూల్కర్. మార్చి 16, 2012న ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెండూల్కర్ 49వ సెంచరీ చేశారు. ఇదే టెండూల్కర్ వన్డే కెరీర్‌లో చివరి ఇన్నింగ్స్.

కోహ్లీ

తొలి సెంచరీ చేసిన స్టేడియంలోనే.. మైలు రాయిని అందుకున్న కోహ్లీ

విరాట్ కోహ్లీ 277ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు. సచిన్ 49సెంచరీల కోసం 452ఇన్నింగ్స్‌లను ఆడారు. ఈడెన్ గార్డెన్స్‌లో విరాట్ కోహ్లీ తన మొదటి వన్డే శతకం (2009లో శ్రీలంక వర్సెస్) సాధించాడు. ఇప్పుడు అదే స్డేడియంలో కోహ్లీ అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. కోహ్లి మొత్తం 79 అంతర్జాతీయ సెంచరీలను కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో 100 సెంచరీలతో టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. వన్డేల్లో సచిన్ సెంచరీలను అందుకున్న కోహ్లీ.. టెస్టుల్లో ఆయన రికార్డును బ్రేక్ చేస్తాడా అంటే అనుమానమే అని చెప్పాలి. టెస్టుల్లో సచిన్‌కు 51 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఇప్పటి వరకు 29 సెంచరీలు మాత్రమే చేశాడు. అంటే టెస్టుల్లో ఇంకా 22 సెంచరీలు చేయాల్సి ఉంటుంది.

 కోహ్లీ

పుట్టిన రోజున వన్డే సెంచరీ సాధించిన మూడో భారతీయుడు

కోహ్లీ స్వదేశంలో వన్డే క్రికెట్‌లో 6,000 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ విషయంలో 6,976 పరుగులను కలిగి ఉన్న టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు కోహ్లీ. కోహ్లి తన 23వ వన్డే సెంచరీని స్వదేశంలో సాధించాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. నవంబర్ 5న కింగ్ కోహ్లీకి 35 ఏళ్లు నిండాయి. కోల్‌కతాలో ప్రోటీస్‌ జట్టుపై కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమ పుట్టినరోజున వన్డే సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. టెండూల్కర్ (134 vs ఆస్ట్రేలియా, 1998), వినోద్ కాంబ్లీ (100* vs ఇంగ్లాండ్, 1993) తమ పుట్టిన రోజు నాడే సెంచరీలు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోహ్లీ బర్త్ డే స్పెషల్ మ్యాచ్