Virat Kohli : రికార్డుల రారాజుగా ముందుకెళ్తున్న విరాట్ కోహ్లీ.. ఏకంగా సచిన్ రికార్డుపై!
పాకిస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచులో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. మొదట పాక్ బౌలర్లపై ఓపెనర్లు ఊచకోత కోయగా, తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ శతకాలతో కదం తొక్కారు. 94 బంతుల్లో 122 పరుగులు చేసి కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ జట్టుకు సాయపడేదుకు ముందు ఉంటానని, కేఎల్ రాహుల్ వన్డేల్లో గొప్పగా పునరాగమనం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
సచిన్ టెండుల్కర్ రికార్డుకు మరింత చేరువలో కోహ్లీ
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు. కోహ్లీ వన్డేల్లో వేగంగా (277 ఇన్నింగ్స్‌ల్లో) 13వేల పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్ కోహ్లీగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (321 ఇన్నింగ్స్) పేరిట ఉంది. టీమిండియా తరుఫున ఆసియా కప్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచులు అవార్డులు సొంతంగా చేసుకున్న ఆటగాడిగా కోహ్లీ(4) నిలిచాడు. ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ శతకాల సంఖ్య 47కు చేరింది. సచిన పేరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డు(49) మరింత దగ్గరయ్యాడు.