Page Loader
Virat Kohli : ప్రపంచ రెకార్డుపై విరాట్ కోహ్లీ కన్ను..వన్డేలో మరో 96 పరుగులు చేస్తే..
ప్రపంచ రెకార్డుపై విరాట్ కోహ్లీ కన్ను..వన్డేలో మరో 96 పరుగులు చేస్తే..

Virat Kohli : ప్రపంచ రెకార్డుపై విరాట్ కోహ్లీ కన్ను..వన్డేలో మరో 96 పరుగులు చేస్తే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి టెస్టుల‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ కొంత మందగించినా, వ‌న్డేల విష‌యానికి వ‌స్తే అత‌డికి మించిన మ్యాచ్ విన్న‌ర్ మ‌రొక‌రు లేరు. పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీపై పెద్దగా ఆశలు ఉన్నాయి. 2013లో ఎంఎస్ ధోని సార‌థ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరొకసారి ఈ టోర్నీలో విజయం సాధించలేకపోయింది. 2023లో భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ, కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో గొప్ప ప్రదర్శన చూపించాడు. 11 మ్యాచ్‌లలో 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వివరాలు 

అరుదైన రికార్డుకు అతి చేరువ‌లో.. 

కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు మరింత చేరువవుతున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలురాయిని చేరే ఆటగాడిగా నిలవడానికి అతనికి ఇంకా 96 పరుగులు అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకంలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ ఈ రికార్డును సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. వన్డే క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరే 14,000 పరుగుల మైలురాయిని సాధించిన ఆటగాళ్ళలో మొదటి, రెండో స్థానాలలో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించగా, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం, కోహ్లీ 295 వన్డేల్లో 13,906 పరుగులు సాధించి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

వివరాలు 

మ‌రో 329 ప‌రుగులు చేస్తే.. 

వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో, సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు, కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ప్రస్తుతం 13,906 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరో 329 పరుగులు చేస్తే, అతను సంగక్కరను మించి రెండో స్థానానికి చేరుకోవచ్చు. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో కోహ్లీ ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం ఉంది. భారత్,ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ 2025 ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో, రెండో వన్డే కటక్‌లో 9 ఫిబ్రవరి 2025 న జరగనుంది. మూడో వన్డే అహ్మదాబాద్‌లో 12 ఫిబ్రవరి 2025 న నిర్వహించబడుతుంది.