Virat Kohli: వాంఖడే స్టేడియంలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ (వీడియో)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంతో సరదాగా ఉంటాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అన్న తర్వాత విరాట్ ఉల్లాసంగా మైదానంలో కనిపిస్తుంటాడు. తన అభిమానుల కోసం కోహ్లీ ఏదైనా చేస్తుంటాడు. నిన్న శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారత గెలుపొందిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో ఇండియా సెమీ-ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. విరాట్ కోహ్లీ 88 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 'రామ్ లఖన్' చిత్రంలోని 'మై నేమ్స్ ఈజ్ లఖన్' పాటను మైదానంలో వినిపించారు. కోహ్లీ ఈ పాటకు డాన్స్ చేసి అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.