Page Loader
Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం 
Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం

Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2024
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు భారత టెస్టు జట్టు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కొంతసేపటి క్రితం క్రితం తమ ఎక్స్‌ (ట్విటర్)అకౌంట్లో వెల్లడించింది. ఈ విషయంపై బీసీసీఐ అభిమానులకు,మీడియాకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉంటాడని.. దయచేసి అతడి ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించొద్దని కోరింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ లో పాల్గొన్నారు.

Details 

వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ కి దూరం అయ్యిన హ్యారీ బ్రూక్

విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్టులకు గైర్హాజరు కావడం భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. హైదరాబాద్‌లో కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా ఈ టెస్ట్ సీరీస్ లో ఆడటం లేదు. బ్రూక్ కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీరీస్ లో ఆడలేకపోతున్నట్లు పేర్కొన్నాడు. ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్‌లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ 2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 172 పరుగులు చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ చేసిన ట్వీట్