VVS Laxman: ఇంకో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత జట్టు గెలుచుకున్న తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. మళ్లీ కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకోలేదు. కానీ అతని సహచర ఆటగాడు, వెటరన్ VVS లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) అధిపతిగా ఉన్నారు. అయితే అతని మూడేళ్ల కాంట్రాక్ట్ సెప్టెంబర్‌తో ముగియనుంది. భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలాన్ని కనీసం ఒక సంవత్సరం పొడిగించనున్నట్లు మునుపటి నివేదికలు వెల్లడించాయి. అంటే NCAలో అతని ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందని ఈఎస్‌పీఎన్,క్రిక్‌ఇన్‌ఫో నివేదిక వెల్లడించింది.
ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్
దీని ప్రకారం లక్ష్మణ్‌తో పాటు అతని సహచరులు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్ ల పదవీకాలం కూడా పొడిగించనున్నారు. లక్ష్మణ్ కంటే ముందు ఎన్‌సీఏ అధిపతిగా రాహుల్ ద్రవిడ్ ఉండేవారు. అనంతరం ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ వచ్చారు. లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్ పదవి నుంచి వైదొలగనున్నాడని, వచ్చే ఏడాది ఐపీఎల్ 2025లో జట్టుకు కోచ్‌గా మారవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే. లక్ష్మణ్ తన పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించే ప్రతిపాదనను అంగీకరించారు.
కొత్త NCA క్యాంపస్ సిద్ధంగా ఉంది
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పని చేస్తోంది. కానీ కొత్త NCA క్యాంపస్ బెంగళూరు శివార్లలో నిర్మించారు. నివేదికల ప్రకారం, ఈ కొత్త NCA క్యాంపస్ కూడా వచ్చే నెలలో ప్రారంభించబడవచ్చు. ఈ కొత్త NCA పునాది 2022లో వేయబడింది, ఇది ఇప్పుడు దాదాపు సిద్ధంగా ఉంది. ఈ కొత్త NCA క్యాంపస్‌లో 3 అంతర్జాతీయ ప్రామాణిక ఫీల్డ్‌లు, 100 పిచ్‌లు, 45 ఇండోర్ పిచ్‌లు, ఒలింపిక్ సైజ్ పూల్ తదితర ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ కొత్త ఎన్‌సీఏ క్యాంపస్‌లో క్రికెటర్లతో పాటు నీరజ్ చోప్రా సహా ఇతర ఒలింపిక్ అథ్లెట్లు కూడా ప్రాక్టీస్ చేయగలరని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు.