
T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్‌కు ఒకే ఒక వార్మప్ మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రాబోయే టీ 20 ప్రపంచ కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారం అంటే మే 16న విడుదల చేసింది.
ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే 20 జట్లలో 17 జట్లకు వార్మప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది.
ఇందులో దక్షిణాఫ్రికా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతుంది. టీ20 ప్రపంచకప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేని మూడు జట్లలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో పాటు బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు కూడా ఉంది.
బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక వార్మప్ మ్యాచ్‌ను ఆడే అవకాశం టీమిండియాకు దక్కనుంది. జూన్ 1న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.
Details
వెస్టిండీస్,ఆస్ట్రేలియా మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి లేదు
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి ముందు 16 ప్రాక్టీస్ మ్యాచ్‌లను నిర్వహించే వేదికలలో టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, క్వీన్స్ పార్క్ ఓవల్,ట్రినిడాడ్,టొబాగోలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ ఉన్నాయి.
క్వీన్స్ పార్క్ ఓవర్‌ల్ లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య మే 30వ తేదీన జరగనున్న మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించరు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐసీసీ చేసిన ట్వీట్
Warm-up matches locked in as teams finalise #T20WorldCup preparations 💪
— ICC (@ICC) May 17, 2024
Details 👉 https://t.co/gK77tLd7kN pic.twitter.com/7bD5laV04u