Paris Olympics : అథ్లెట్లకు మాంసం కొరత .. సరఫరాను పెంచిన నిర్వాహకులు
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ఆసక్తిగా సాగుతున్నాయి. అయితే ఒలింపిక్ విలేజ్ లోని క్రీడాకాకులకు తగినంత మాంసం, కోడిగుడ్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ మెనూలో మాంసం, చీజ్ వంటివి కొద్ది మోతాదులోనే వడ్డిస్తున్నారు. ఎందుకంటే మెగా టోర్నీలో పాల్గొంటున్న అథ్లెట్లకు జంతువులకు సంబంధించిన ప్రోటిన్ ను తక్కువగా ఇవ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో నిర్వాహకులను తప్పు పట్టాల్సిన పని లేదు.
ఫిర్యాదు చేసిన అథ్లెట్లు
మంసాన్ని ఇష్టపడే అథ్లెట్లు తమకు ఇష్టమైన ఆహార పదార్థాలు లేకుండా పోయాయని వాపోయారు. దీనిపై అథ్లెట్లు ఫిర్యాదు చేయడంతో పారిస్ నిర్వాహకులు ఒలింపిక్ విలేజ్ రెస్టారెంట్‌లో మాంసం సరఫరాను పెంచారు. దీని కోసం ఆర్గనైజింగ్ కమిటీ ఫ్రెంచ్ బహుళజాతి సోడెక్సోతో కలిసి అనేకమంది చెఫ్‌లను నియమించుకుంది. తాను రోజుకు 5,000 క్యాలరీల వరకు తింటానని అయితే ఆదివారం ఉదయం 10:30 గంటలకు అల్పాహారం కోసం వచ్చినా, గుడ్లు మిగిలి లేవని అథ్లెట్ హార్రెగో చెప్పాడు. తాము ఆకుకూరలను మాత్రమే తింటాం, కాబట్టి ఇది మాకు సమస్య కాదని కెనడియన్ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి సోఫీ బుకోవెక్ వివరించారు.