Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆ దేశ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్యాన్స్ ఎంపీ సంచలన కామెంట్స్
మరో నాలుగు రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. పారిస్ వేదికగా ఒలింపిక్స్ జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి. ఈ తరుణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్యాన్స్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
ఎంపీ థామస్ వ్యాఖ్యలపై మద్దతు,విమర్శలు
ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనడం వల్ల వారికి స్వాగతం పలికేది లేదని ఫ్యాన్స్ ఎంపీ థామస్ పోర్టెన్ ప్రకటించడం ఆందోళనలకు గురి చేస్తున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో ఎంపీ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ థామస్ వ్యాఖ్యలపై కొందరు మద్దతు ఇవ్వగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్
మరోవైపు ఈ వ్యాఖ్యలను ఫ్రాన్స్ యూదుల గ్రూప్ ప్రతినిధి ఒకరు ఖండించారు. అథ్లెట్స్ ను లక్ష్యం చేసుకొని ఈ వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. ఇప్పటికే అథ్లెట్స్ కు ప్రమాదం పొంచి ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇక 1972 ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లను హత్య చేసిన ఉదంతాన్ని గుర్తు చేశారు.