భారత్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ జట్టు ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టీమిండియా, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్లు నికోలస్ పూరన్, ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యాడు. మేజర్ లీగ్ లో నికోలస్ పూరన్ బీజీగా ఉండటంతో ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
మరోవైపు హోల్డర్ కు విండీస్ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక ఈ వన్డే సిరీస్‌లో విధ్వంసకర ఆటగాడు షిమ్రాన్ హిట్‌మెయిర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే జట్టుకు షై హోప్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
Details
భారత్ తో తలపడే విండీస్ జట్టు ఇదే
విండీస్ పేసర్ ఓషానే థామస్ చాలా గ్యాప్ తర్వాత విండీస్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈనెల 27, 29, ఆగస్టు 1వ తేదీల్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.
టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకున్న విండీస్, వన్డే సిరీస్‌లో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
వెస్టిండీస్ వన్డే జట్టు ఇదే
షై హోప్ (కెప్టెన్), రోమన్ పావెల్(వైస్ కెప్టెన్), హెట్‌మేయర్, థామస్, కైల్ మేయర్స్, అథాంజే, అల్జరీ జోసెఫ్, బ్రెండన్ కింగ్, యానిక్ కారియా, కార్టే, డొమినిక్ డ్రేక్స్, గుడకేష్ మోటీ,, షెఫార్డ్, సింక్లెయిర్, జైడెన్ సీల్స్