టీమిండియాకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్‌బ్రావో స్వాగతం.. నెట్టింట వీడియో వైరల్
భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే కోసం మంగళవారం టీమిండియా ట్రినిడాడ్ చేరుకుంది. ఈ మేరకు మ్యాచ్ వేదికైనా టరుబాకు భారత ఆటగాళ్లు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన కుమారుడితో కలిసి భారత ఆటగాళ్లకు స్వాగతం పలికాడు. ఈ వీడియోను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. బస్సు దిగి వస్తున్న వారిని బ్రావో పేరుపేరునా పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. IPLలో చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో సహచర ఆటగాళ్లు జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లకు బ్రావో హగ్ ఇవ్వడం విశేషం. చివరగా బ్రావోను కలిసిన రోహిత్ శర్మ, బ్రావో కుమారుడితో ముచ్చటించారు.