వెస్టిండీస్ చిచ్చరపిడుగు వచ్చేశాడు.. టీమిండియాతో టీ20 మ్యాచ్‌లకు కరేబియన్ జట్టు ప్రకటన
టీమిండియాతో 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో కరేబియన్ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (WICB) ప్రకటించింది. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఆగస్ట్ 3న ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీలో తొలి మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ కు దూరమైన చిచ్చరపిడుగు ఆటగాడు నికోలస్ పూరన్ పొట్టి క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. అమెరికాలో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం పూరన్ టీమిండియాతో వన్డేలకు వైదొలిగాడు. ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ తరపున బౌలర్లను బెంబేలెత్తించాడు. ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్న షెమ్రాన్ హైట్‌మైర్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్, బౌలర్ థామస్‌కు సెలెక్టర్లు అవకాశమిచ్చారు.
వెస్టిండీస్ ఉత్తమ జట్టును తయారు చేసే ప్రణాళికలో సెలక్షన్ కమిటీ
2024లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ తరఫున ఉత్తమ జట్టును తయారు చేసే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ పేర్కొన్నారు. వెస్టిండీస్ టీ-20 జట్టు : రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, ఒషానే థామస్, రోమారియో షెఫెర్డ్, ఓడియన్ స్మిత్. ఐదు టీ-20 వేదికలు : 1. ఆగస్టు 3 (ట్రినిడాడ్) 2. ఆగస్టు 6 (గయానా). 3. ఆగస్టు 8 (గయానా) 4. ఆగస్టు 12 (ఫ్లోరిడా) 5. ఆగస్టు 13 (ఫ్లోరిడా)