LOADING...
Chris Woakes: నా ఫొటోకు రిషభ్‌పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ.. థాంక్యూ చెప్పా : క్రిస్‌ వోక్స్ 
నా ఫొటోకు రిషభ్‌పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ.. థాంక్యూ చెప్పా : క్రిస్‌ వోక్స్

Chris Woakes: నా ఫొటోకు రిషభ్‌పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ.. థాంక్యూ చెప్పా : క్రిస్‌ వోక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. వీరిలో ఒకరు టీమిండియాకు చెందిన రిషబ్ పంత్ కాగా, మరొకరు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్. ఈ ఇద్దరూ గాయాలతో బాధపడుతున్నప్పటికీ తమ జట్ల కోసం గట్టిగా పోరాడారు. పంత్‌కు కాలు గాయమవగా, వోక్స్ భుజం స్థానభ్రంశం కావడంతో ఒక చేత్తోనే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమానంగా ముగిసింది. ఈ చివరి మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు వోక్స్‌ను అభినందించారని, శుభమన్ గిల్, రిషభ్ పంత్ నుంచి తనకు సందేశాలు వచ్చాయని వోక్స్ వెల్లడించాడు.

వివరాలు 

శుభ్‌మన్ గిల్ ప్రశంసలు: 

''నొప్పులతో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చినందుకు గిల్ నన్ను మెచ్చుకున్నాడు.ఇది ఎంతో ధైర్యంగా తీసుకున్న నిర్ణయమని అతడు చెప్పాడు.ఐదో టెస్టు ముగిసిన తర్వాత నేను గిల్‌తో మాట్లాడా.ఈ సిరీస్ నీకు గుర్తుండిపోయేలా ఉంటుంది అన్నా.బాగా ఆడావు. జట్టును ముందుండి నడిపించిన తీరు అసాధారణం. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించావు.నేను కూడా బ్యాటింగ్‌కు రావాలన్న నిర్ణయాన్ని సరైనదిగా భావిస్తున్నా. అప్పటికప్పుడు టీమ్‌కు ఇంకా 100 పరుగులు అవసరముండగా క్రీజ్‌లోకి వచ్చాను. అది కాస్త ఇబ్బందికరంగా అనిపించినా, ఆ సమయంలో వెనక్కి తగ్గేవాడిని కాను. కానీ చివరకు మేము మ్యాచ్ ఓడిపోవడం మాత్రం ఇప్పటికీ బాధ కలిగిస్తోంది. నాకు మాత్రమే కాదు, ఏ జట్టుకైనా ఆ పరిస్థితిలోని ఆటగాళ్లు ఇదే చేస్తారని నమ్ముతున్నాను'' అని వోక్స్ వివరించాడు.

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్ ఇంటరాక్షన్.. పంత్ వాయిస్ మెసేజ్: 

''నాకు సంబంధించిన ఓ ఫొటోపై రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ పెట్టాడు. అది చూసి నేను ధన్యవాదాలు చెబుతూ 'మీ ప్రేమకు కృతజ్ఞుడిని. పాదం బాగానే ఉందని అనుకుంటున్నా' అని రిప్లయ్ చేశా. ఆ తర్వాత పంత్ నన్ను ప్రోత్సహిస్తూ వాయిస్ మెసేజ్ పంపాడు. అందులో, 'అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా. త్వరగా కోలుకో. తప్పకుండా ఎప్పుడో ఒక రోజు మనిద్దరం కలుద్దాం' అన్నాడు. దీనికి స్పందనగా నేను కూడా 'నీకు గాయం జరిగినందుకు నిజంగా బాధపడ్డాను' అని సారీ చెప్పా'' అని క్రిస్ వోక్స్ వివరించాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వోక్స్ బౌలింగ్ చేస్తుండగా పంత్ రివర్స్ షాట్‌ కొట్టే ప్రయత్నంలో గాయపడిన విషయం తెలిసిందే.