
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు కారణం ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
"మేం టీ20కి వచ్చామా? లేక టెస్ట్ మ్యాచ్‌కే వచ్చామా అనిపిస్తోంది. సీఎస్కే బ్యాటింగ్ ఏమాత్రం పోరాటం చేయలేదు. గెలవాలని ప్రయత్నమే చేయలేదు. ధోనీ రిటైర్ అయి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి," అని చెపాక్ స్టేడియం వెలుపల ఓ అభిమాని కమెంట్ చేశాడు.
ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం అభిమానుల నిరాశకు కారణమైంది. మ్యాచ్ తర్వాత స్టేడియం వదిలినవాళ్లంతా - "ఇలాంటి ఆట కోసం డబ్బులు వెచ్చించామా?" అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
వివరాలు
సొంతగడ్డపై ఓటమి - ఆశ్చర్యం కలిగించిన తీరు
చెన్నైలోని చెపాక్ స్టేడియం సీఎస్కేకు కంచు కోట. కానీ ఈసారి అది తారుమారు అయింది.
17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ, 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చెపాక్‌లో సీఎస్కేను ఓడించాయి.
ఐపీఎల్‌లో తొలుత 'చేజింగ్ కింగ్స్'గా పేరు గాంచిన సీఎస్కే, 2019 తర్వాత 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోతుంది.
ఇది జట్టులో గేమ్‌చేంజింగ్ బ్యాట్స్‌మెన్లు లేరన్న సంకేతం. ప్రత్యర్థి జట్లు 180కు పైగా పరుగులు చేస్తే, సీఎస్కేను ఓడించవచ్చన్న ధైర్యం వస్తోంది.
చిరునవ్వు మాయం చేసిన బాటింగ్
ఒత్తిడిని ఎదుర్కొని, గెలవాలన్న తపన ఉన్న ఆటగాళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చూసిన అభిమానులు - "ఒకరు కూడా పోరాడేలా కనిపించలేదు" అంటున్నారు.
వివరాలు
పాత ఫార్ములాతో నడిచే నావ
సీఎస్కే ప్లేయర్ సెలెక్షన్ పద్ధతి పాత తరం ఆలోచనలకు నిదర్శనం. ఇప్పుడు మారిన ఐపీఎల్ పోటీ తత్వానికి ఇది సరిపడదు.
ఇతర జట్లు యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటే, సీఎస్కే మాత్రం పాత ఆటగాళ్లపైే ఆధారపడుతోంది.
బిగ్ హిట్టర్లను ఎవరు చూస్తారు?
తొమ్మిదో స్థానం వరకూ బ్యాటర్లు ఉన్నా, క్లచ్ మూమెంట్లలో జట్టును గెలిపించగల భారీ హిట్టర్లు సీఎస్కేలో లేరు.
పోనీ ఎవరైనా ఉన్నారా అంటే అభిమానులు శివం దుబే పేరును మాత్రమే ప్రస్తావిస్తారు.
కానీ అతను కూడా ప్రతి మ్యాచ్‌లో గేమ్‌ను తిరగరాసే స్థాయిలో ఆడటం లేదు. జడేజా, దుబే, దీపక్ హుడా ఈ సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌ను నిబద్ధతతో ముందుకు నడిపించలేకపోయారు.
వివరాలు
యువ ఆటగాళ్లకు లభించని అవకాశం
ధోనీకి జట్టును నడిపించిన అనుభవం ఉన్నా, యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు అందడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వేలంలో కొనుగోలు చేసిన యువ ఆటగాళ్లకు ఒక్కసారైనా తుది జట్టులో చోటు దక్కలేదు. ఇతర జట్లు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న వేళ, సీఎస్కే మాత్రం మౌనంగా ఉంది.
పాతికేళ్ల ఆటగాళ్లపై ఆధారపడితే వచ్చే పరిణామమే ఇది
ఫామ్‌లో లేని ఆటగాళ్లను ఎంపిక చేయడంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు లేని ప్లేయర్లు — సామ్ కరన్, ఎల్లిస్, ఓవర్టన్ మొదలైనవారిని జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవాళీ ప్రదర్శన కూడా అశ్వాసజనకంగా లేదు.
వివరాలు
చెపాక్ కోట దెబ్బతిన్నా... ఫార్ములా మారలేదు
ఇక చెపాక్ స్టేడియంలో గెలవలేరు అనే స్థాయికి చేరింది. ప్రత్యర్థులు కొత్త ప్రణాళికలతో జట్టును ఎదుర్కొంటున్నారు. పిచ్ పరిస్థితులు మారినప్పటికీ, సీఎస్కే పాత ఫార్ములానే వర్తింపజేస్తూ విజయాన్నిదూరం చేసుకుంటోంది.
ధోనీకి విమర్శల వాన - "ఇప్పుడు కాదు అంటే ఎప్పుడు?"
ధోనీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టినా...ముందుగా దూకుడుగా ఆడకుండా గడిపిన సమయం అభిమానులను విసిగించింది. "ధోనీ రిటైర్మెంట్" అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
వివరాలు
ధోనీ రిటైర్మెంట్ గురించి ఫ్లెమింగ్ ఏమన్నాడు?
ధోనీ భవిష్యత్తుపై ప్రశ్నలకు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానమిచ్చారు.
"ఆ విషయం ధోనీపై ఆధారపడి ఉంటుంది. అతను ఇంకా ప్రభావవంతంగా ఉన్నాడని నమ్ముతున్నాను. ఇప్పటికి ఆ అంశంపై ఎటువంటి చర్చ జరగలేదు," అని ఆయన అన్నారు.
"ఇంకా జాగ్రత్త పడాలి".. వసీం జాఫర్ హెచ్చరిక
భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్, "జట్టులోని బ్యాట్స్‌మెన్లు కనీసం గెలవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పటివరకు సీఎస్కే 17 మంది ఆటగాళ్లను రొటేట్ చేసింది, కానీ ప్రయోజనం లేకపోయింది.దీనికి ముందు చెన్నైజట్టు 2015లో 14 మంది ఆటగాళ్లను, 2021లో 16 మంది ఆటగాళ్లను మార్చింది''అని క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విమర్శించారు.