Ground Staff: పిచ్ పర్యవేక్షణ బాధ్యతలు,గ్రౌండ్‌ను మెయింటెన్ చేసే వారి శాలరీ ఎంతో తెలుసా?
క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్లు, అంపైర్లు, కోచ్‌లు మనకు గుర్తుకు వస్తారు. కానీ, మ్యాచ్ సజావుగా జరగడానికి వీలుగా స్టేడియంను సిద్ధం చేయడంలో, నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించే వారు గ్రౌండ్ స్టాఫ్. వీరి ప్రాధాన్యత ఎంతైనా కానీ, ఎక్కువ మంది వారి పనిపై అంతగా శ్రద్ధ పెట్టరు. ఈ కథనంలో గ్రౌండ్ స్టాఫ్ జీతం ఎంత? వారి బాధ్యతలు ఏమిటి? వంటి వివరాలు తెలుసుకుందాం.
గ్రౌండ్ స్టాఫ్ పనితీరు
గ్రౌండ్ స్టాఫ్ ప్రధాన బాధ్యతలు పిచ్ సిద్ధం చేయడం, ఔట్‌ఫీల్డ్ మెయింటెనెన్స్ నిర్వహించడం, వర్షం పడితే గ్రౌండ్‌లోని నీరు వెళ్లిపోయేటట్లు సముచిత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి పనులు చేస్తారు. అంతేకాదు, బౌండరీ రోపులు సరిచేయడం వంటివి కూడా చూస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో గ్రౌండ్ స్టాఫ్‌కు నెలకు సుమారు రూ.30,000 జీతం లభిస్తుందని సమాచారం. ఈ జీతం దేశానికి తగ్గట్టుగా మారవచ్చు.
జీతాలపై ప్రభావం చూపే అంశాలు
అనుభవం: గ్రౌండ్ స్టాఫ్ జీతం అనుభవం, స్టేడియం ఉన్న ప్రదేశం ఆధారంగా మారవచ్చు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి క్రికెట్ ప్రధాన దేశాలలో వీరికి అధిక శాలరీలు లభించవచ్చు. బహుమతులు: భారత్ సహా మరికొన్ని దేశాల్లో జట్టు లేదా క్రికెట్ బోర్డులు మ్యాచ్‌ల అనంతరం గ్రౌండ్ స్టాఫ్‌కు ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. పిచ్ మెయింటెనెన్స్ బాగా ఉంటే ఈ ప్రోత్సాహకాలు మరింత ఉంటాయి. కాంట్రాక్టులు: కొంతమంది గ్రౌండ్ స్టాఫ్ క్రికెట్ బోర్డులు, క్లబ్‌లతో ఫుల్‌టైమ్ ఒప్పందాలపై పని చేస్తారు. వీరికి ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ కారణంగా వారి జీతాలు మరింత ఉంటాయి.
గ్రౌండ్ స్టాఫ్‌కు ఎదురయ్యే సవాళ్లు
గ్రౌండ్ స్టాఫ్ స్టేడియం నిర్వహణలో కీలక పాత్ర పోషించినప్పటికీ, వారికి ఆశించిన మేర జీతం లభించడం లేదు. ముఖ్యంగా ప్రపంచకప్‌ల వంటి పెద్ద టోర్నమెంట్లు జరిగినప్పుడు మాత్రమే బోర్డులు బోనస్‌లు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయి. ఈ కారణంగా, క్రికెట్ ప్రపంచంలో గ్రౌండ్ స్టాఫ్ జీతాలపై చర్చలు జరుగుతున్నాయి. పిచ్ సరిగా లేకపోతే మ్యాచ్ నిలిచిపోవచ్చు కాబట్టి, వారి పనికి తగిన గుర్తింపు, పారితోషికం లభించాలి అన్నది విశ్లేషకుల అభిప్రాయం. గ్రౌండ్ స్టాఫ్ కీలకం: మ్యాచ్ సజావుగా జరిగేందుకు వీరే మూల స్థంభం. వీరి సేవలకు తగిన గుర్తింపు లభించాలని అంతా కోరుకుంటున్నారు.