IPL 2025 Auction: రియాద్‌లో ఐపీఎల్ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.
ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఆరుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అందువల్ల రైట్ టు మ్యాచ్ ఆప్షన్ లేకుండా పోయింది.
ఈ సందర్భంగా మిగిలిన ఆటగాళ్లను మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయాలని జట్లు సిద్ధమవుతున్నాయి.
వచ్చే మూడేళ్ల కాలానికి తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే, ఈ మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది.
వివరాలు
నవంబర్ 24, 25 తేదీల్లో వేలం నిర్వహించే ఛాన్స్
గతంలో దుబాయ్ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ వేలం ఈ సారి మాత్రం సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా జరిగే అవకాశం ఉందని సమాచారం.
నవంబర్ 24, 25 తేదీల్లో వేలం నిర్వహించే ఛాన్స్ ఉందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి, కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమవుతుండటంతో, ఈ టెస్టు మధ్యలోనే ఐపీఎల్ వేలం నిర్వహించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డిస్నీ హాట్‌స్టార్‌లో వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రియాద్‌లో మధ్యాహ్నం సమయంలో వేలం నిర్వహించడంతో ఆస్ట్రేలియా టైమింగ్ కు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని సమాచారం.
వివరాలు
రిషభ్ పంత్‌పైనే అందరి దృష్టి
ఈసారి వేలం పై ఆసక్తి పెరిగిపోవడానికి ప్రధాన కారణం భారత స్టార్ ఆటగాళ్లు ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే.
రిషభ్ పంత్,కేఎల్ రాహుల్,శ్రేయస్ అయ్యర్,అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్ వంటి పలువురు ఆటగాళ్లు అందుబాటులో ఉండటంతో అభిమానులు వీరి పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా రిషభ్ పంత్‌ను ఎవరు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
అతడికి కనీసం రూ. 25 కోట్ల బిడ్డింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ రూ. 50 కోట్ల బిడ్డింగ్ వచ్చే అవకాశం ఉందని అంటుండగా, భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కూడా కేఎల్ రాహుల్ రూ. 20 నుంచి రూ. 25 కోట్ల రేంజ్‌లో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.