
World Cup 2023: షకీబ్ చేసింది కరెక్ట్ కాదు.. మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై మాజీల అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్ జరిగిన మ్యాచులో శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని దిగ్గజ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేసింది కరెక్ట్ కాదని, షకీబ్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాల్సిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఇక 146ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే టైమ్డ్ ఔటైనా తొలి ప్లేయర్‌గా ఏంజెలో మాథ్యూస్ చరిత్రకెక్కాడు.
దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఇది చాలా ఆన్యాయమని, ఈ ఘటన చాలా అనైతికం, అన్యాయమంటూ గంభీర్ ట్విట్ చేశాడు.
Details
షకీబ్ అల్ హసన్ తీరును తప్పుపట్టిన డెయిల్ స్టెయిన్
సౌతాఫ్రికా మాజీ పేసర్ డేయిల్ స్టెయిన్ సైతం షకీబ్ అల్ హసన్ తీరును తప్పుబట్టాడు.
మరోవైపు పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ కూడా ఇది క్రికెట్ స్ఫూర్తికి మంచిది కాదని సూచించారు.
మాథ్యూస్ క్రీజులో ఉండగా హెల్మెట్ విరిగిపోయిందని, ఇలా టైమ్డ్ ఎలా ఇస్తారని ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ప్రశ్నించాడు.
హెల్మెట్ సమస్యతో టైమ్ ఔటవ్వడం కొత్తగా వింటున్నానని వాన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహరం హాట్ టాపిక్‌గా మారింది.