Page Loader
IPL 2025: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్

IPL 2025: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

'వావ్! సూపర్ ఫోర్.. అనుకునేలోపే మరో భారీ సిక్సర్. కనికరం లేని బ్యాటింగ్.. చెమటలు కక్కుతున్న బౌలర్లు!' అంత రసవత్తరమైన మ్యాచ్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత SRH ప్లేయర్లు ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వచ్చారు. ఈ సమయంలో యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)బౌండరీ లైన్‌ వద్దకు వచ్చాడు. అక్కడున్న కొంతమంది అభిమానులు పెద్దగా అరుస్తూ.. 'బ్రో!పెళ్లి ఎప్పుడు?లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా?లేక అరేంజ్‌డ్ మ్యారేజ్ నా?' అని ప్రశ్నించారు. వారి అరుపులు,కేకలతో వాతావరణం హోరెత్తిపోయింది.ఈ ప్రశ్నలకు నితీష్ స్పందిస్తూ,చాలా స్పష్టంగా లవ్ మ్యారేజ్ చేసుకోవట్లేదని హింట్ ఇచ్చాడు.

వివరాలు 

SRH గ్రాండ్ విక్టరీ 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే క్రమంలో నెటిజన్లు 'ప్రపంచమంతా తిరిగినా.. మన తెలుగోడు సంప్రదాయాలు మర్చిపోలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, SRH జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు బ్యాటర్లు వచ్చినవారంతా బౌలర్లను చీల్చి చెండాడారు. ఇషాన్ కిషన్ (106),ట్రావిస్ హెడ్(67),క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి(30),అభిషేక్ శర్మ(24) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో SRH 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులకే పరిమితమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..