Asia Cup Final Scenario: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఏదీ?
ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భాగంగా శ్రీలంకపై భారత్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆసియా కప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఇండియా, పాయింట్స్ టేబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఒక ఓటమి, ఒక గెలుపుతో శ్రీలంక రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ సూపర్ 4లో రెండు మ్యాచులు ఓడిపోవడంతో ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ రెండింట్లో అసియా కప్ ఫైనల్‌లో భారత జట్టుతో తలపడే జట్టు ఏదన్నది ఆసక్తికరంగా మారింది. రన్ రేట్ పరంగా చూస్తే శ్రీలంకనే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
సెప్టెంబర్ 14న శ్రీలంక, పాక్ మధ్య మ్యాచ్
పాకిస్థాన్ (-1.892)కంటే శ్రీలంక (-0.200) రన్‌రేట్ మెరుగ్గా ఉంది. సెప్టెంబర్ 14న శ్రీలంక, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ ఫైనల్ కు చేరాలంటే కచ్చితంగా శ్రీలంకపై గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోతే ఇరు జట్లు చెరో పాయింట్ లభిస్తాయి. దీంతో శ్రీలంకకు మెరుగైన రన్ రేట్ ఉండడం కారణంగా ఆ జట్టు ఫైనల్‌లో భారత్ తో తలపడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకూ ఆసియా కప్ ను అత్యధికంగా టీమిండియా ఆరు సార్లు గెలవగా, శ్రీలంక జట్టు ఐదు సార్లు గెలుపొందింది. ఇప్పటివరకూ అసియా కప్ ఫైనల్ లో భారత్-పాక్ జట్లు తలపడలేదు.