RJ Mahvash: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో యుజ్వేంద్ర చాహల్ వెంట మిస్టరీ గర్ల్.. ఎవరీ ఆర్జే మహవాష్ ?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ఓ యువతితో కలిసి వీక్షించడంతో, నెటిజన్లు ఆ మిస్టరీ గర్ల్ ఎవరు అనే ఉత్సుకతతో ఆరా తీస్తున్నారు.
అసలు ఆమె ఎవరో తెలుసుకుంటే, ఆమె ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్ (RJ Mahvash).
వివరాలు
ఫైనల్ మ్యాచ్‌లో చాహల్‌తో మహ్‌వశ్
దుబాయ్ వేదికగా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను మహ్‌వశ్,చాహల్ కలిసి వీక్షించారు.
మ్యాచ్‌కు ముందు,మహ్‌వశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను షేర్ చేసింది.
అందులో చాహల్‌తో కలిసి నవ్వుతూ టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు తెలిపింది.ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే, వీరిద్దరూ ఇలా కలిసినది ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబరులోనూ చాహల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను మహ్‌వశ్ పోస్ట్ చేయగా, అప్పుడే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వచ్చాయి.
అయితే, మహ్‌వశ్ అవన్నీ అసత్యవార్తలని ఖండించింది. తప్పుడు కథనాలు సృష్టించవద్దని స్పష్టం చేస్తూ, తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని నెటిజన్లను కోరింది.
ఇదే విషయంపై చాహల్ కూడా స్పందిస్తూ వదంతులు పుట్టించవద్దని సూచించాడు.
వివరాలు
మహ్‌వశ్ ఎవరు?
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌కు చెందిన మహ్‌వశ్, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ పూర్తి చేసింది.
ప్రాంక్ వీడియోల ద్వారా యూట్యూబ్‌లో ఫేమస్ అయింది. అంతేకాక, ఓ ప్రముఖ ఎఫ్‌ఎంలో రేడియో జాకీగా మంచి గుర్తింపు పొందింది.
ప్రాంక్ వీడియోలతో పాటు మహిళా సాధికారతపై అవగాహన కల్పించే అంశాలపై వీడియోలు రూపొందిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్‌లోనూ మహ్‌వశ్‌కి నటిగా అవకాశాలు వచ్చినట్లు పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.