
Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 9 ఏళ్లలో తొలి కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా మైదానం తడిగా మారి, మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
షాక్ ఏమిటంటే, స్వదేశంలో సాధారణంగా భారత కెప్టెన్లు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారు.
కానీ రోహిత్ 9 ఏళ్ల తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం విశేషం.
చివరిసారిగా 2015లో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రెండో టెస్టులో ఫలితం ఏమిటో చూడాలి.
వివరాలు
ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి..
కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలమని భావించి, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుందని అందరూ ఊహించారు.
కానీ రోహిత్ ముగ్గురు పేసర్లను ఎంపిక చేసి, కేవలం ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే తీసుకున్నాడు.
వర్షం కారణంగా పిచ్ తడిగా ఉండటంతో, ఈ పరిస్థితిని అదనుగా ఉపయోగించుకోవాలని రోహిత్ భావించాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడని ఆశించినా, అతడు మరికొంతకాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.