Virat Kohli: 'నా లంచ్‌పై ఎందుకింత చర్చ'?.. ప్రసారకర్తలపై కోహ్లీ అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మంచి ఆహార ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తన క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లతోనే ఫిట్‌గా ఉంటానని గతంలో చెప్పిన కోహ్లీ, దిల్లీ వంటకాలంటే ప్రత్యేకంగా ఇష్టపడతాడు.
ముఖ్యంగా 'చోలే బటూరే' అంటే చాలా ఇష్టం. మ్యాచ్‌ల సమయంలో కూడా ఈ వంటకం తినడం చాలాసార్లు కెమెరాల్లో హైలైట్ అయ్యింది.
అయితే తన ఆహారపు అభిరుచులపై ప్రసారకర్తలు చూపిస్తున్న ఆసక్తి కోహ్లీకి నచ్చడం లేదు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ, ప్రసారకర్తల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
భారత్‌ను క్రీడా దేశంగా తీర్చిదిద్దేందుకు తామంతా కృషి చేస్తున్నామని, దాన్ని నిజం చేసేందుకు గ్రౌండ్‌వర్క్ కొనసాగుతోందన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందన్నారు.
Details
మార్చి 22న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్
కేవలం మౌలిక సదుపాయాలు లేదా పెట్టుబడిదారుల గురించి కాకుండా, ఆటపై దృష్టిసారించాలన్నారు.
బ్రాడ్‌కాస్ట్ షోల్లో ఆట గురించి చర్చించాలని, తన లంచ్ గురించి లేదా దిల్లీలో తనకు ఇష్టమైన 'చోలే బటూరే' ఎక్కడ లభిస్తాయనే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.
దానికి బదులుగా ఒక అథ్లెట్ తన ప్రదర్శనను ఎలా మెరుగుపరుచుకుంటున్నాడనే దానిపై చర్చించాలంటూ కోహ్లీ స్పష్టం చేశాడు.
చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ, ప్రస్తుతం ఐపీఎల్-2025 సీజన్‌కు సిద్ధమవుతున్నాడు.
ఆదివారం అతను ఆర్సీబీ క్యాంప్‌లో చేరగా, మార్చి 22న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది.