KL RAHUL: ఆఫ్ఘనిస్తాన్ టీ20లకు కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు?
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది.
జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,సంజూ శాంసన్,యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్,యశస్వి జైస్వాల్ ఉన్నారు.
అయితే వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను (KL Rahul)అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు పక్కన పెట్టేయడం అభిమానులను అసంతృప్తికి గురి చేసింది.
సెంచూరియన్ పిచ్‌పై సెంచరీతో చెలరేగిన రాహుల్, దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో ఒకడు.
కానీ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ,ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే T20I సిరీస్‌కు జట్టులో అతనికి చోటు కల్పించలేదు.
దింతో ఆఫ్ఘనిస్తాన్ టీ20లకు కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు?అనే చర్చ మొదలైంది.
Details
ఖాళీగా లేని ఓపెనింగ్ స్లాట్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం,కేఎల్ రాహుల్ టెస్టులు, వన్డేల్లో మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు.
పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగేవాడు.కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో రాహుల్‌కు బదులుగా శుభ్‌మాన్ గిల్ లేదా యశస్వి జైస్వాల్ లో ఒకరు రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు.
ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా లేదు.రోహిత్, కోహ్లీ ఉండటంతో టాప్ ఆర్డర్‌లోనూ ప్లేస్ లేదు.
వికెట్ కీపర్ల విషయానికి వస్తే,సెలెక్టర్లు జితేష్ శర్మ,సంజూ శాంసన్ ద్వయం ఫినిషర్లుగా సరిపోతారని ఎంచుకున్నారు.
Details
ఐపీఎల్‌లో రాణిస్తే.. వరల్డ్ కప్ జట్టులో కేఎల్ ఖాయం
అటు మిడిలార్డర్‌లోనూ రింకు సింగ్, శివమ్ దూబె వంటి హిట్టర్లను ఎంపిక చేసింది.
ఇటీవల రింకు అద్భుత 'షినిషర్'గా మారాడు. మరోవైపు రాహుల్ టీ20ల్లో ఇంతవరకు ఈ పాత్రను పోషించలేదు.
అయితే, రాబోయే ఐపీఎల్‌లో రాణిస్తే ప్రపంచ కప్‌లోకి తలుపులు తెరుచుకుంటాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ లీగ్‌లో మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ జట్టులోకి రావడం ఖాయం.