WI vs IND 1st T20I: బ్రియాన్ లారా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం.. నేడే తొలి టీ20 మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతోంది.
మరోవైపు వెస్టిండీస్ తరుపున నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లు మళ్లీ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.
ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో నేడు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది.
టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఈ వేదికపై మొత్తం నాలుగు టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్లు మూడు మ్యాచుల్లో నెగ్గాయి.
Details
ఇరు జట్లలోని ఆటగాళ్లు వీరే
ఈ మైదానంలో జాసన్ హోల్డర్ 10 టీ20 మ్యాచుల్లో 213 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లను పడగొట్టాడు. జాన్సన్ చార్లెస్ 10 టీ20 మ్యాచులు ఆడి మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.
భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ జట్టు : కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్ ఒబెడ్ మెక్‌కాయ్.