రంగంలోకి దిగిన బ్రియాన్ లారా.. వెస్టిండీస్ పరాజయాలకు చెక్ పడేనా?
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ క్యాలిఫైయర్ మ్యాచుల్లో వెస్టిండీస్ చేతులెత్తేసింది. లీగ్ దశలో ధాటిగా ఆడిన ఆడిన విండీస్, సూపర్ సిక్స్ స్టేజ్ లో దాన్ని కొనసాగించలేకపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఓటమిపాలై ప్రపంచ కప్ 2023లో ఆడే అర్హతను విండీస్ కోల్పోయింది. స్కాట్‌లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి చిన్న జట్ల చేతిలో ఓడిన విండీస్ జట్టుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఓటమికి పరిష్కార మార్గాలను అన్వేషించే పనిలో పడింది వెస్టిండీస్. త్వరలో ఇండియాతో జరగుతున్న సిరీస్ కోసం దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ను రంగంలోకి దించితున్నట్లు సమాచారం.
విండీస్ జట్టు మెంటర్ గా బ్రియన్ లారా!
వెస్టిండీస్ జట్టు మెంటర్‌గా బ్రియన్ లారా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ టూర్ మొత్తానికి విండీస్ జట్టుకు లారా సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెస్టులు, వన్డేలకు తగినట్లుగా ఆటగాళ్లకు బ్రియన్ లారా శిక్షణిస్తారని సమాచారం. ఇండియా, వెస్టిండీస్ సిరీస్ జూలై 12 నుంచి మొదలు కానుంది. ఇండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులను విండీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు విండీస్ గడ్డపై అడుగుపెట్టారు. బ్రియాన్ లారా నేతృత్వంలో విండీస్ పరాజయాలకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.