IND vs BAN: బంగ్లాతో చివరి టీ20.. ఉప్పల్‌లో భారత్ క్లీన్ స్వీప్ సాధిస్తుందా?
భారత జట్టు, బంగ్లాదేశ్‌తో చివరి టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను గెలిచి ఈ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచులోనూ ఎలాగైనా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు చివరి మ్యాచులో అయినా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు పడిపోయినా, భారత్ 222 పరుగులను చేసింది.
అద్భుత ఫామ్ లో భారత ఆటగాళ్లు
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో రాణించారు. హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. భారత బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ పేసర్లుగా రాణిస్తుండగా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా కీలక సమయంలో వికెట్లు తీస్తున్నారు. చివరి మ్యాచులో టీమిండియా కొన్ని మార్పులు చేసే అవకాశముంది. రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హర్షిత్ రాణ్ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు వాతావరణం కొంత అడ్డంకిగా మారింది.
వర్షం కురిసే అవకాశం
వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బంగ్లాదేశ్ జట్టులో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాణిస్తుండగా, బ్యాటింగ్ విభాగంలో శాంటో, లిటన్ దాస్ వంటి ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇరు జట్లు (అంచనా) భారత జట్టు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్/హర్షిత్ రాణా. బంగ్లాదేశ్ జట్టు పర్వేజ్, లిటన్ దాస్, శాంటో, తౌహిద్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, మెహిదీ హసన్, రిషద్, తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజుర్