IND Vs SA : సౌతాఫ్రికాతో అసలైన పరీక్షా.. ఈసారైనా జెండాను పాతుతారా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మరో పర్యటనకు భారత్ సిద్ధమైంది.
మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం రెండు నెలల పాటు సౌతాఫ్రికాతో పర్యటించనుంది.
ఇప్పటికే ఈ టూరుకు సంబంధించి మూడు ఫార్మాట్ల జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలో భారత్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలు ఈ పర్యటనలోని వైట్ బాల్ సిరీస్‌కు దూరమయ్యారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ గడ్డలపై భారత క్రికెట్ జట్టుకు మెరుగైన రికార్డు ఉంది.
అయితే సౌతాఫ్రికాలో మాత్రం టీమిండియా తడబడుతోంది.
Details
టెస్టు సిరీస్ లో విజయం కోసం టీమిండియా కృషి
పరిమిత ఓవర్లలో క్రికెట్లో భారత్ రాణిస్తున్నా, టెస్టుల్లో మాత్రం వెనకడుగు వేస్తోంది.
2022లో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా పూర్తిగా విఫలమైంది. రెండు టెస్టులోనూ భారత్ పరాజయం పాలైంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ విజయం కోసం గంగూలీ, ద్రావిడ్ లాంటివాళ్లకు కూడా సాధ్యం కాలేదు.
అయితే ఈ చరిత్రను తిరగరాసే అవకాశం రోహిత్ సేనకు వచ్చింది.