
ENG vs IND : లార్డ్స్ టెస్టులో స్పిన్నర్లు రాణిస్తారా..? రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో మెరిశాడు. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో పంత్ 342 పరుగులు చేశాడు. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జూలై 10 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రిషబ్ పంత్ పాల్గొన్నాడు. మూడో టెస్టులో బౌలింగ్ కాంబినేషన్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి టెస్టులో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది.రెండో టెస్టులో మాత్రం నలుగురు సీమర్లు,ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.
Details
మూడో టెస్టులో విజయంపై భారత్ దృష్టి
మూడో టెస్టులో ఎలాంటి కాంబినేషన్ ఉంటుందన్నదానిపై ప్రశ్న ఎదురవ్వగా, పంత్ సమాధానంగా తుది నిర్ణయాన్ని త్వరలోనే జట్టు యాజమాన్యం ప్రకటిస్తుందని పేర్కొన్నాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు లేక ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశాలున్నాయన్న హింట్ ఇచ్చాడు. మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలన్న ఉద్దేశాన్ని పంత్ వ్యక్తపరిచాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి గెలవడంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. అయితే లార్డ్స్ వేదికపై భారత్ రికార్డు అంతగా ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు అక్కడ 19 టెస్టులు ఆడగా, కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. అయినా ఈసారి భారతజట్టు విజయంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.