తదుపరి వార్తా కథనం

T20 World Cup : 2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 10, 2025
10:01 am
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించే అవకాశముందని సమాచారం. ఈ సారి టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పోటీపడబోతున్నాయి. జట్లను ముందుగా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. అనంతరం సూపర్ 8 దశ, తర్వాత సెమీఫైనల్స్, చివరగా గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది.