
T20 womens world cup: యూఏఈకి తరలిన మహిళల టీ20 ప్రపంచకప్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో. మహిళల టీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చనున్నట్లు ఐసీసీ మంగళవారం తెలిపింది.
ఈ ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలలో జరగనుంది.
ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డైస్ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి పలు దేశాలు నిరాకరిస్తున్నక్రమంలో టోర్నీ వేదికను మార్చడం తప్ప ఐసీసీకి మరో మార్గం లేకపోయింది. ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. వేదిక మార్పునకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించింది" అని అన్నారు.
వివరాలు
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకి కృతజ్ఞతలు: జియోఫ్ అలార్డైస్
జియోఫ్ అలార్డైస్ ఇంకా మాట్లాడుతూ, 'భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో ఐసిసి గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేము ఆశిస్తున్నాము. బిసిబి తరపున ఆతిథ్య బాధ్యతలు తీసుకున్నందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీలంక, జింబాబ్వే కూడా ముందుకు వచ్చాయి, ఇందుకు కృతజ్ఞతలు. 2026లో ఈ రెండు దేశాల్లో ICC గ్లోబల్ ఈవెంట్‌లను నిర్వహించాలని ఆశిస్తున్నాము. మహిళల T20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీలంక, జింబాబ్వే కూడా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చివరికి ఐసీసీ ఈ పెద్ద బాధ్యతను యూఏఈకి అప్పగించింది" అని తెలిపారు.
వివరాలు
ప్రపంచకప్‌లో భారత జట్టు అక్టోబర్ 4న తొలి మ్యాచ్ ఆడనుంది
ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడనుంది.
దీనికి ముందు, ఆ జట్టు వెస్టిండీస్,బంగ్లాదేశ్‌లతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పుడు టీమ్ ఇండియా ప్రపంచకప్‌లోనే కనిపించనుంది.