Page Loader
INDIA Vs PAK : ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్‌.. మధ్యాహ్నం పాక్‌తో భారత్‌ ఢీ
ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్‌.. మధ్యాహ్నం పాక్‌తో భారత్‌ ఢీ

INDIA Vs PAK : ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్‌.. మధ్యాహ్నం పాక్‌తో భారత్‌ ఢీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 14, 2023
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కప్‌-2023లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక లీగ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. శనివారం మధ్యాహ్నం పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది. అయితే ఈ దఫా మరోసారి భారతదేశం జగజ్జేతగా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, దాయాది పాకిస్థాన్‌ పని పట్టేందుకు సన్నద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం(నరేంద్ర మోదీ)లో పాక్‌ను చిత్తుచేయాలని రోహిత్ సేన ఆరాటపడుతోంది. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఏడు మ్యాచ్‌లు జరగగా, ఏడుకు ఏడింట్లోనూ భారత్ విజేతగా నిలిచింది. ఒకప్పుడు భారత్‌, పాక్ మ్యాచ్‌ అంటే పాక్‌ బౌలింగ్‌, భారత బ్యాటింగ్‌కు సవాల్ విసిరేది. ఇప్పుడు టీమిండియాకూ నాణ్యమైన పేసర్లు ఉన్నారు.

details

టాస్‌ గెలిచిన టీమ్ ఛేజింగ్ వైపే మొగ్గు  

తుది జట్లు (అంచనా) : భారత్‌ : రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌/ఇషాన్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌, హర్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవీచంద్రన్ అశ్విన్‌/ మహమ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌. పాకిస్థాన్‌: అజమ్ బాబర్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా, ఇమామ్‌, రిజ్వాన్‌, షకీల్‌, ఇఫ్తిఖార్‌, షాదాబ్‌, నవాజ్‌, షాహీన్‌, హసన్‌ , రవుఫ్‌. పిచ్‌, వాతావరణం : గుజరాత్ లోని అహ్మదాబాద్‌ క్రికెట్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ తొలిపోరులో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించనుంది. మరోవైపు వాతావరణం వేడీగా, పొడిగా ఉండనుంది.టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.