
బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలోనే ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI)కి కొత్తగా మరో సమస్య మొదలైంది. సవరించిన వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో మరోసారి మార్పులను కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బీసీసీఐను కోరింది.
ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(GCA), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(BCA) అభ్యర్ధన కారణంగా గతంలోనే ప్రకటించిన షెడ్యూల్‌కు ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది.
తాజా షెడ్యూల్ మేరకు మరో వారంలో టికెట్లను సైతం విక్రయించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ, భారత క్రికెట్ బోర్డుకు షాక్ న్యూస్ అందించింది. షెడ్యూల్ లో మరోసారి మార్పుల కోరుతూ అభ్యర్థించడం గమనార్హం.
details
బ్యాక్ టూ బ్యాక్ మ్యాచులకు భద్రతా కష్టం : హైదరాబాద్ పోలీసులు
ప్రపంచ కప్ నూతన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మహానగరంలో అక్టోబర్ 9న న్యూజిల్యాండ్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజే అంటే అక్టోబర్ 10న పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది.
వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహణకు భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని రాచకొండ పోలీసులు హెచ్‌సిఏను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ అభ్యర్దను క్రికెట్ అసోసియేషన్ పరిగణలోకి తీసుకుంది.
దీంతో ఈ విషయంపై బీసీసీఐకు లేఖ సంధించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ మేరకు పాక్ శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న నిర్ణయించారు. తాజా షెడ్యూల్ తో సదరు మ్యాచ్ 2 రోజులు ముందు జరిగింది. దీంతో మార్పులు కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది.