ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సూపర్ సిక్స్ : శ్రీలంకతో పోరుకు సిద్ధమైన నెదర్లాండ్
భారత వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం అర్హత సాధించడానికి రెండు జట్లకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే వేదికగా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో లీగ్ దశలో ముగియడంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి. ఇందులో శ్రీలంకతో పోటీ పడేందుకు నెదర్లాండ్ సిద్ధమైంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచులోనూ విజయం సాధించిన శ్రీలంక గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. నెదర్లాండ్ నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో శుక్రవారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ వేదిక ఇప్పటివరకు ఐదు మ్యాచులు జరగ్గా, ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు గెలుపొందాయి.
ఇరు జట్లలోని సభ్యులు
మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. నెదర్లాండ్ జట్టు కంటే శ్రీలంక బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా వినిందు హసరంగా ఆల్ రౌండర్ ఫర్ఫామెన్స్ తో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంక (ప్రాబబుల్ XI): పాతుమ్ నిస్సాంక, కరుణరత్నే, కుసల్‌మెండిస్ (వికెట్ కీపర్), సమరవిక్రమ, చరిత్అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్‌షనక (కెప్టెన్), వనిందు హసరంగా, మహేశ్‌తీక్షణ, కసున్‌కుమార్ రజిత. నెదర్లాండ్స్ (ప్రాబబుల్ XI): మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్‌సింగ్, వెస్లీబరేసి, బాస్‌డి లీడే, తేజానిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్ & వికెట్ కీపర్), జుల్ఫికర్, లోగాన్‌వాన్ బీక్, క్లేటన్ ఫ్లాయిడ్, ఆర్యన్, వివియన్ కింగ్మా.