Wrestler Vinesh Phogat : ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగట్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడానికి ముందు భారత అగ్రశేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వైఖరికి నిరసనగా వినేష్ ఫోగట్ తనకు వచ్చిన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ బాడీకి నిరసనగా సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
భారం కాకూడదనే ఉద్ధేశంతోనే తిరిగి ఇచ్చేస్తున్నా : వినేష్ ఫోగట్
ఇక మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్ మెంట్‌పై వదిలిపెట్టారు. ఇంత జరిగాక ఇక తన జీవితంలో ఖేల్ రత్న, అర్జున అవార్డులకు విలువ లేదని, ఈ అవార్డులు భారం కాకూడదనే ఉద్ధేశంతోనే తిరిగి ఇచ్చేస్తున్నా ప్రధాని సార్ అంటూ ఎక్స్ లో వినేష్ ఫోగట్ పేర్కొంది. ఏ మహిళ అయినా అత్మగౌరవాన్ని కోరుకుంటుందని, తాను కూడా అంతేనని తెలిపింది. 2016లో అర్జున, 2020లో 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డులతో వినేష్ ఫోగట్‌ను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.