
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ప్రత్యేకమైన రికార్డును నెలకొల్పాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ ప్రారంభ బంతికే అత్యధిక సార్లు సిక్సర్ కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా తన పేరును లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు జైస్వాల్ మొత్తం మూడు సందర్భాల్లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు.
2025 ఐపీఎల్ సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదడంతో ఈ ఘనత అతని ఖాతాలో చేరింది.
ఐపీఎల్ గడిచిన సీజన్లలో మొత్తం ఎనిమిది మంది బ్యాటర్లే ఇన్నింగ్స్ ప్రారంభ బంతికే సిక్సర్ కొట్టినప్పటికీ, మూడు సార్లు ఈ ఫీట్ సాధించిన ఏకైక క్రికెటర్ జైస్వాల్ మాత్రమే.
వివరాలు
రోహిత్, సెహ్వాగ్‌కు కూడా సాధ్యం కాలేదు
బెంగళూరు జట్టు నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగింది.
మ్యాచ్ ప్రారంభ ఓవర్‌ను సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికే యశస్వి జైస్వాల్ శక్తివంతమైన షాట్‌తో బంతిని సిక్సర్‌గా మలిచాడు.
ఆ తర్వాత కూడా జైస్వాల్ అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించాడు. అతను కేవలం 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.
జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ కావడంతో అర్థ శతకం (హాఫ్ సెంచరీ) ను తృటిలో కోల్పోయాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ కొట్టడం వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి దూకుడైన ఓపెనర్లకూ సాధ్యం కాలేదు.
వివరాలు
మొదటి బంతికే సిక్సర్ కొట్టిన బ్యాటర్ల జాబితా ఇదే..
ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సర్ కొట్టిన బ్యాటర్ల జాబితాలో మొత్తం 8 మంది ఉన్నారు.
వారిలో:
యశస్వి జైస్వాల్ (3 సార్లు),
నమన్ ఓజా (1 సారి),
మయాంక్ అగర్వాల్ (1 సారి),
సునీల్ నరైన్ (1 సారి),
విరాట్ కోహ్లీ (1 సారి),
రాబిన్ ఊతప్ప (1 సారి),
ఫిల్ సాల్ట్ (1 సారి),
ప్రియాన్ష్ ఆర్య (1 సారి) లు ఈ ప్రత్యేక జాబితాలో ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యశస్వి జైస్వాల్ ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా రికార్డు
Most times hitting six on the first ball in IPL
— Meer Ki Ghazal (@gazal_ki) April 24, 2025
3 - Yashasvi Jaiswal*
1 - Naman Ojha
1 - Mayank Agarwal
1 - Sunil Narine
1 - Virat Kohli
1 - Robin Uthappa
1 - Phil Salt
1 - Priyansh Arya pic.twitter.com/F4BasbAoOI