Yashasvi Jaiswal: టీమిండియా కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్? గౌతమ్ గంభీర్ కీలక సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టెస్టు కెప్టెన్ విషయంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.
బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశాలు ఏర్పడినట్లు కథనాలు వెలువడ్డాయి.
అయితే రోహిత్ తాత్కాలికంగా టెస్టు జట్టులో కొనసాగుతానని ప్రకటించారు. అలాగే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వరకు అతడు జట్టులోనే ఉంటాడు.
ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా పేరు కెప్టెన్‌గా ముందుకు వస్తున్నా, అతని ఫిట్‌నెస్‌పై అనేక సందేహాలు ఉన్నాయి. బుమ్రా కెప్టెన్సీకి సెలక్టర్లు, కోచ్ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.
ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ల పేర్లు కూడా అభ్యర్థులుగా తెరమీదకొచ్చాయి.
Details
కెప్టెన్ ఎంపికపై కసరత్తు
గౌతమ్ గంభీర్, యశస్వి జైస్వాల్ నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు.
మరోవైపు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనుభవజ్ఞుడైన రిషబ్ పంత్ వైపు చూస్తున్నట్లు సమాచారం.
ఈ వివాదంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అన్నది స్పష్టతను సాధించలేదు, కానీ జట్టులో కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో అన్నదీ ఆసక్తికరంగా మారింది.