అరంగేట్రం మ్యాచులోనే రికార్డులను బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వీ 215 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్న యశస్వీ, అతనితో కలిసి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత్ తరుపున అరంగేట్ర మ్యాచులోనే సెంచరీ బాదిన నాలుగో పిన్న వయస్కుడిగా యశస్వీ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో పృథ్వీషా అగ్రస్థానంలో ఉన్నాడు.
మూడో భారతీయుడిగా యశస్వీ జైస్వాల్ రికార్డు
టెస్టు అరంగ్రేటంలోనే సెంచరీ చేసిన 17వ భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అయితే వెస్టిండీస్‌తో ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా అతను రికార్డుకెక్కాడు. అదే విధంగా అరంగేట్రం టెస్టులో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్ జైస్వాల్ నిలిచాడు. అరంగేట్రంలో ధావన్ (188), రోహిత్ 177 రన్స్ చేయగా.. ప్రస్తుతం యశస్వీ జైస్వాల్ 143 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 312/2 స్కోరు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 162 పరుగుల అధిక్యంలో నిలిచింది.