Page Loader
IPL 2025: దిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్..! పాంటింగ్ స్థానంలో యువరాజ్ సింగ్?
దిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్..! పాంటింగ్ స్థానంలో యువరాజ్ సింగ్?

IPL 2025: దిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్..! పాంటింగ్ స్థానంలో యువరాజ్ సింగ్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2024
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇప్పటికే ఫ్రాంచైజీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. ప్లేయర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌లోనూ భారీగా మార్పులు, చేర్పులు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు హెడ్ కోచ్ రికీ పాటింగ్‌ను తప్పించి ఆ స్థానంలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం యువ‌రాజ్ సింగ్‌కి బాధ్య‌త‌లు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ కొట్టిన దిల్లీ ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది.

Details

ఈ ఏడాది చివర్లో వేలానికి బీసీసీఐ ప్లాన్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ నియ‌మితుడు కానున్నాడ‌ని తాజాగా స్పోర్ట్‌స్టార్ ఓ కథనం ప్రచురించింది. ఇందుకు సంబంధించి యూవీతో డీసీ యాజమాన్యం చర్చలు కూడా మొదలు పెట్టిందని తెలిపింది. దీనిపై దిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. హెడ్ కోచ్‌గా యూవీకి అనుభవం లేకపోయినప్పటికీ యువ ప్లేయర్లను తీర్చిద్దడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. శుభ్‌మాన్ గిల్, అభిషేక్ వర్మ వంటి ప్లేయర్లు యూవీ వద్దనే శిక్షణ పొందడం గమనార్హం. ఐపీఎల్ 2025 ముందు వేలాన్ని ఈ ఏడాది చివరిలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.